హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ లో అగ్నిప్రమాదం.. వీడియో చూడండి

  • హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ప్రమాదం
  • వెల్డింగ్ పనులు జరగుతుండగా ఎగసిపడ్డ నిప్పురవ్వలు
  • మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది
హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. స్టేషన్ లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. దీంతో, మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో వెల్డింగ్ పనులు చేస్తున్నవారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
hyderabad metro rail
Fire Accident
hytech city metro rail

More Telugu News